మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికి రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. వానాకాలం సాగు దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు. Also Read: Bandi Sanjay: విద్యార్థులకు శుభవార్త..…
తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది.…
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గేమ్‌ప్లాన్ మార్చారా? ఇక వాళ్లకి వీళ్ళకి వదిలేయడం ఎందుకని అనుకుంటున్నారా? అందుకే తాను డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టబోతున్నారా? ఆ దిశగా ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారా? ఏ విషయంలో గేమ్ ఛేంజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి? ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది? Read Also: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా? తెలంగాణలో పవర్లోకి వచ్చి ఏడాదిన్నర దాటి పోయింది. మొదట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా… ఇప్పుడు…
తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్ దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి బంపర్ ఆఫర్ కొట్టేశారాయన. ఆయన పరంగా చూస్తే... అంతా బాగానే ఉంది.
తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి.. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పారు.. సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్‌లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి.. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు.. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్…