నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
ఐదేళ్లు తానే కర్ణాటక సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. మీకెందుకు అలాంటి డౌట్స్ ఉన్నాయి? అని మీడియాను ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని…
మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో... ప్రభుత్వ విప్ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్‌తో లోకల్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొండా సురేఖ, మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే... కొండా కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగత ఇన్‌స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పరెంట్ అంటూ పెట్టిన పోస్ట్ కాకరేపుతోంది. అసలు కొండా మురళి దంపతులకు, జిల్లా కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్‌నకు కారణమే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో జల వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ ఎపిసోడ్‌ని సీరియ్‌గా తీసుకోవాలని భావించింది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఆ పార్టీ నేత హరీష్‌రావు వరుస మీడియా సమావేశాలు పెట్టి... తెలంగాణ, ఆంధ్ర నీటి పంపకాల అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య దోస్తానా .. అంటూ వాళ్ళిద్దరికీ ముడిపెట్టి రాజకీయ అంశంగా మలచాలని భావించిందట గులాబీ పార్టీ.
Dialogue War: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్న ప్రదీప్ రావు వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది తమ పార్టీ అని ఆయన…
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.