Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మోడీ ఎవరినీ విమర్శించలేదు.. విభజన టైంలో పార్లమెంట్లో చోటు చేసుకున్న అంశాల గురించే ప్రస్తావించారని క్లారిటీ ఇచ్చారు.
మెదక్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని తెలిపారు.
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి నూతన భవనంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగిస్తూ జీ20 సదస్సుపై ప్రధాని మోడీ చర్చించారు.
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తెలంగాణలలోని సంక్షేమ పథకాలను పోల్చుతూ పోస్టర్లు ఆదివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. breaking news, latest news, telugu news, big news, brs, congress,
పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి, గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ గా మారింది అని ఆయన దుయ్యబాట్టారు.