TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.
CWC meeting: చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాబోతున్నారు.
CWC Meeting: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. 'భారత్ జోడో యాత్ర' రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Anurag Thakur: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత, రాష్ట్రమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ, కేంద్రమంత్రులు డీఎంకే పార్టీపై ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka: కర్ణాటకలో ఫ్రెష్ గా మారో వివాదం రాజుకుంది. హుబ్బల్లిలోని వివాాదాస్పద ఈద్గా మైదనంలో గణేష్ విగ్రహానని ప్రతిష్టించడానికి అనుమతి కొరుతూ హిందూ కార్యకర్తలు స్థానిక, జిల్లా పరిపాలనను ఆశ్రయించారు.
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు.