తెలంగాణ విమోచన దినోత్సవం, కాంగ్రెస్ 5 గ్యారంటీ కార్యక్రమంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు కొంతమంది సెప్టెంబర్ 17పై లేని అపోహలను సృష్టిస్తున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు.
మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని చాలా మంది వచ్చి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే ప్రయత్నాలు చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాల్క సుమాన్ అన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు పోటాపోటీగా ‘సెప్టెంబర్ 17’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పోలీసు విభాగం అలర్ట్ అయింది.
సనాతన్ ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సంబంధించి 'భారత్' కూటమిని బీజేపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ ప్రకటన చేశారు. డీఎంకే మంత్రి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ దానిని నాశనం చేయదని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా హైదరాబాద్ కొచ్చారు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందరం స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు సభకు తరలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైంది.. ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదు.. అప్పుల రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా సనతాన ధర్మంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి (INDIA)ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్, విపక్షాల కూటమిపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
INDIA Bloc: ఇండియా కూటమి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు. ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.