Rahul Gandhi: డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ.. కౌగిలించుకునే ఫొటో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోను పోస్ట్ చేసి “ద్వేషం మార్కెట్‌లో ప్రేమ దుకాణం” అని రాశారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ మాట్లాడుతూ.. తన నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు, మద్దతునిచ్చేందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని తెలిపారు. తాను ఒంటరివాడిని కాదని.. ప్రజాస్వామ్యానికి ధీటుగా నిలబడే వారందరూ తన వెంటే ఉన్నారని అన్నారు.
Read Also: Manchu Manoj: ర్యాంప్ ఆడిద్దాం అంటున్న మంచు మనోజ్..
Also Read
మరోవైపు రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. అతని సిగ్గుమాలిన, చిల్లర చర్య సభ గౌరవానికి మచ్చ అని పేర్కొంది. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇటువంటి ద్వేషం, ద్వేషపూరిత మనస్తత్వానికి దేశంతో పాటు కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. గురువారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బిధూరి ప్రకటనను ఖండించిన ప్రతిపక్షాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాయి. మరోవైపు రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా.. రమేష్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान pic.twitter.com/3IqLMFU0dx
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2023
- Tags
- bjp
- congress
- Danish Ali
- Hugging
- Photo
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు