Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో…
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.
DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
Gautam Adani: అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది.
గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Adani- Congress: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది.