Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
- కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాం..
- హస్తం తీరుపై ఠాక్రే సేన విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది. తాజాగా ఎంవీఏ కూటమి ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిగా భావించి ఉండాల్సిందని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే అన్నారు.
Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో దాని వైఖరి మమ్మల్ని బాధించింది. ఉద్దవ్ ఠాక్రేని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. ఇలా చేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి’’ అని దాన్వే అన్నారు.
ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలలో సమయంలో కూడా శివసేన ఠాక్రే వర్గం, కాంగ్రెస్‌కి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సంజయ్ రౌత్, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలేని బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లోనే గెలుపొందింది. 89 సీట్లలో పోటీ చేసిన శివసేన ఠాక్రే వర్గం 20 స్థానాలను గెలుచుకుంది. 87 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ శరద్ పవార్ కేవలం 10 అసెంబ్లీల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఠాక్రే సేన తన బలాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతుందని దాన్వే చెప్పారు. ఏక్‌నాథ్ షిండే వల్ల శివసేన చీలిపోయిందని, బీజేపీకి చాలా రాష్ట్రాల్లో షిండేలు ఉన్నారని, వారిని బీజేపీ వాడుకుని పారేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!