Kadiyam Srihari: తప్పు చేశాడు కనుకే భయపడుతున్నాడు.. కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు
- కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
- అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారు- కడియం శ్రీహరి
- రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- కడియం శ్రీహరి
- కేటీఆర్ కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని..
- గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందోనని భయపడుతున్నాడు- కడియం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాల నియామకాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఏం చేశారు…? గాడిదలు కాసారా…? అని దుయ్యబట్టారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి, బ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. హరీష్ రావుకు పిచ్చికుక్క కరిసినట్టు మాట్లాడుతున్నాడు.. బోనస్ ఇస్తామంటే హరీశ్ రావు అంతా బోగస్ అంటున్నారని మండిపడ్డారు.
SubbaRaju : నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే..
Also Read
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ.. విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నీతి నిజాయితీ అని బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే లేదు.. పార్టీ చేసిన విధ్వంసం.. అవినీతి, అక్రమాలు వల్ల వీళ్ళ పాపాలు పండుతాయని తెలిసి ఆ పాపాలు తనకు అంటోద్దని తాను బయటకు వచ్చానన్నారు. జనగాం ఎమ్మెల్యే 10 లక్షల పనిచేసిన తాను ముక్కు నేలకు రాస్తానని తెలిపారు.
Priyanka Gandhi: కసువ చీరలో మెరిసిన ప్రియాంక.. ఇందిరను జ్ఞాపకం చేసుకున్న కేరళీయులు
కేటీఆర్‌కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నాడని ఆరోపించారు. చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ భయపడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విచిత్ర ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాలు తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా సిద్ధంగా ఉండాలని తెలిపారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!