Top 10 Google Searches: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. 2024 ముగింపు దశకు చేరుకుంది. ఎన్నో అంశాలు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఏడాదిగా పేరు సంపాదించింది. అనేక ప్రముఖ విషయాలు చోటు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను గూగుల్ వెల్లడించింది. రాజకీయాల నుంచి స్పోర్ట్స్ వరకు భారతీయులు వెతికిన టాప్-10 అంశాలను తెలిపింది.
1) ఇండియన్ ప్రీమియర్ లీగ్:
భారతదేశంలో క్రికెట్ ఒక మతంలాంటిది. కోట్ల సంఖ్యలో ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ రేంజ్ మారింది. గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్ టాప్ ప్లేసులో నిలిచింది. అభిమానులు తమ టీమ్స్, ప్లేయర్లు, వేలంపాటల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
2) టీ20 వరల్డ్ కప్:
ఐపీఎల్ తర్వాత భారతీయులు ఎక్కువగా టీ20 ప్రపంచ కప్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. స్కోర్ అప్‌డేట్స్, ప్లేయర్ల ఆటతీరు, గేమ్ ప్రిడిక్షన్స్ గురించి ఎక్కువగా శోధించారు.
3) బీజేపీ:
ఈ ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే భారతీయులు రాజకీయాలపై ఆసక్తికనబరుస్తారు. బీజేపీ విధానాలు, నాయకులు, ఎన్నికల వ్యూహాల గురించి, ఎన్నికల ర్యాలీలు, ప్రచార ప్రకటనల గురించి సెర్చ్ చేశారు.
4) ఎన్నికల ఫలితాలు 2024:
ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో 2024 ఎన్నికల ఫలితాలు కూడా ఉన్నాయి. ఏ స్థానంలో ఎవరు గెలిచారు వంటి వాటి గుర్తించి శోధించారు.
5) ఒలింపిక్స్ 2024:
2024 ఒలింపిక్స్ గురించి భారతీయులు సెర్చ్ చేశారు. భారతీయ అథ్లెట్లు, వినేష్ ఫోగట్ నుంచి నీరజ్ చోప్రా వరకు సెర్చ్ చేశారు.
6) అధిక వేడి:
2024లో హీట్ వేవ్ గురించి కూడా చాలా మంది వెతికినట్లు గూగుల్ చెప్పింది. ఉష్ణోగ్రత వివరాలు గురించి సెర్చ్ చేశారు. వేసవిలో వేడి నుంచి భద్రత, చల్లగా ఉండటానికి చిట్కాలు గురించి ఆన్‌లైన్‌లో శోధించారు.
7) రతన్ టాటా:
భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గురించి చాలా మంది నెటిజన్లు తెలుసుకోవాలని అనుకున్నారు. ఆయన మరణానంతరం టాటా వ్యాపారాలు, గతంలో ఇంటర్వ్యూల గురించి వెతికారు. అక్టోబర్ 09న రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు.
8) కాంగ్రెస్:
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ గురించి కూడా ఈ ఏడాది చాలా మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. కాంగ్రెస్ 2024 ఎన్నికల విధానాలు, పార్టీ నాయకత్వం, ఎన్నికల వ్యూహాల గురించి చర్చ నడిచింది.
9)ప్రో కబడ్డీ:
ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2024 గురించి క్రీడాభిమానుల అధికంగా సెర్చ్ చేశారు. పీకేఎల్ టీమ్స్, ఆటగాళ్లు, మ్యాచ్ షెడ్యూల్స్ గురించి శోధించారు.
10) ఇండియన్ సూపర్ లీగ్ (ISL):
ఇండియాన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) గురించి అభిమానులు సెర్చ్ చేయడం భారత్‌లో ఫుట్‌బాల్‌కి పెరుగుతున్న ఆదరణని చూపుతోంది.