ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.
Jubilee Hills By Election: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్.. పార్టీ నేత నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్…
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11…
మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్‌పై దాడికి యత్నించడానికి ఖర్గే ఖండించారు.
తెలంగాణ కేబినెట్ కట్టు తప్పుతోందా? మంత్రుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా? ఏమవుతుందిలే అనుకుంటూ.. నోటికి పనిచెప్పే బ్యాచ్ పెరుగుతోందా? అసలు అజెండా కంటే… సొంత అజెండానే కొందరికి ఎక్కువైపోయిందా? కొంచెం తగ్గించుకుంటే మేలేమో….. అని సొంత పార్టీ నేతలే ఎందుకు అనాల్సి వస్తోంది? మంత్రులు ఔటాఫ్ కంట్రోల్ అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ మంత్రుల్లో కొందరు అసలు పని గాలికొదిలేసి…. అనవసర విషయాల్లో అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. మేం ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఏం…
స్థానిక ఎన్నికల వేళ ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా? పార్టీ పెద్దలు కూడా... కమ్ కమ్ వెల్కమ్ అంటున్నా లోకల్ ఈక్వేషన్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయా? సీఎంతో ఉన్న సాన్నిహిత్యం ఫైనల్‌గా ఆ లీడర్‌కి కలిసొస్తుందా? లేక అడ్డంకి అవుతుందా? ఎవరా మాజీ శాసనసభ్యుడు? ఏంటా జంపింగ్ జపాంగ్ కహానీ? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఎర్రశేఖర్.
Minister Tummala: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు.
Ponnam vs Adluri Laxman Row: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి…
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్‌లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది.