బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది.
Off The Record: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం యేడాదికి 25 కోట్లు ఇవ్వాలని ఆయన స్వరం పెంచడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పాలమూరు ఎమ్మెల్యేది స్వపక్షమా? లేక విపక్షమా? అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేల చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఇబ్బందిగా మారిందని, పెళ్ళిళ్ళకో, పరామర్శలకో…
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ల అజెండా మజ్లిస్‌ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఎర్రగడ్డలో హరీశ్‌రావు ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్-బీజేపీ మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. జిల్లా నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశానికి రామచందర్‌రావు, కిషన్‌రెడ్డి హాజరై డివిజన్ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి…