Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “కాంగ్రెస్ పార్టీ గెలవలేక తప్పుడు ప్రచారానికి దిగింది. నేను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో ఎప్పుడు ఫోటో దిగానో కూడా నాకు తెలియదు. పాత ఫోటోను పోస్ట్ చేసి ‘శ్రీనివాస్ గౌడ్ నవీన్ యాదవ్‌కు మద్దతు’…
Off The Record: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు తన మాటను ఖాతరు చేయడం లేదని, ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారాయన. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్…
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా…
మొత్తానికి బీహార్ విపక్ష కూటమిలో చోటుచేసుకున్న సంక్షోభానికి తెర పడింది. కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అశోక్ గెహ్లాట్ జరిపిన దైత్యం విజయవంతం అయింది. దీంతో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ను కలిశారు.
బీహార్‌లో విపక్ష కూటమి మళ్లీ కలవబోతుందా? మునుపటి స్నేహమే కొనసాగించబోతున్నారా? ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ వేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఏకతాటిపై ఉన్న కూటమి.. సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో చివరి నిమిషంలో ఎవరికి వారే వేరైపోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
బెంగళూరు రోడ్లపై వివాదం తలెత్తిన వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ను బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తన మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా శివకుమార్‌ను ఆహ్వానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.
రాహుల్‌గాంధీ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత. కాంగ్రెస్ అగ్ర నేత. రాజీవ్ గాంధీ-సోనియాగాంధీల ఏకైక కుమారుడు. వయసు 55 ఏళ్లు. 1970 జూన్ 19న జన్మించారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడిగానే ఉన్నారు. ఎన్నోసార్లు రాహుల్ గాంధీ పెళ్లి వార్తలు వచ్చాయి కానీ నిజం కాలేదు.