ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది.. మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది..…
ఢిల్లీలో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారో నేటితో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైంది. మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ నిరహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? లేదా రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల అధికార కరువును అంతం చేస్తుందా? అనే దానిపై అందరి దృష్టి ఉంది. అదే సమయంలో గత రెండు…
Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ!
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టాయి. ఇండియా అలయన్స్ గా ఏర్పడి 2024 ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించాయి. ఫలితంగా బీజేపీ మెజారిటీని కోల్పోయింది. ప్రధాని మోడీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రదేశాల మద్దతు తీసుకోవలసి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి టెన్షన్ పెంచిన అఖిల భారత కూటమి ఢిల్లీ ఎన్నికల్లో చెల్లాచెదురుగా కనిపించింది. కాంగ్రెస్ ఒంటరిగా మారింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులను చేరుస్తారా లేదా కొందరిని తప్పిస్తారా అన్న విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దే అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసులను చట్ట ప్రకారం ముందుకు తీసుకెళతామని తెలిపారు. తాను సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. కుల…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు.…
ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు సాకే శైలజానాథ్. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.