Actor Sivaji: మహిళల డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ వివరణ.. “ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sivaji: కోర్ట్ సినిమాలో మంగపతిగా ప్రత్యేకగా గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు శివాజీ. ఆయన గతంలో హీరోగా ఎన్నో చిత్రాల్లో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మహిళల డ్రెస్‌ల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకూడదని చెప్పారు.
READ ALSO: Tata Punch EV Facelift: పాత పంచ్ EVతో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్‌లో 5 కీలక మార్పులు..
Also Read
ఈ సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానేప్పుడు మాట్లాడే మాటలపై కంట్రోల్ లేకుండా మాట్లాడానని చెప్పారు. తాను గతంలో డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేసిన టైంలో రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందన్నారు. నిజానికి ఇవే మాటలను ఆ పదాలు వాడకుండా కూడా గతంలోనూ చెప్పానన్నారు. కానీ ఆరోజు ఎందుకు అలా మాట్లాడానో తెలియలేదని చెప్పారు. తర్వాత చూసుకుంటే ఆ పదాలు నేనే మాట్లాడానా? అని అనిపించిందన్నారు. నిజానికి ఆ తర్వాత ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి ఆ తర్వాత మూడు రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పారు. ఇప్పటి వరకూ కొన్ని వందల ప్రెస్‌మీట్, డిబేట్‌లలో పాల్గొని మాట్లాడానాని, ఎప్పుడూ నోరు జారలేదని చెప్పారు. కానీ ఆ రోజు అలా జరిగిపోయిందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రపంచంలో మగవారు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరని చెప్పారు. ఆ టైంలో తాను మహిళా కమిషన్‌కు ముందుకు వెళ్లినప్పుడు తనకు తెలిసినవాళ్లే తనపై కంప్లైంట్ చేశారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు. వాస్తవానికి తనపై కంప్లైంట్ చేసిన వాళ్లంటే ఇప్పటికీ తనకు గౌరవం ఉందన్నారు. అయితే ఎవరు తనపై కంప్లైంట్ ఇచ్చారనేది తాను చెప్పనని, అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!