రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా.. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు విమర్శలు…
ఆ ఎమ్మెల్యే ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరారో గానీ ఎప్పుడూ వివాదాలేనట. పైగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ ఫిర్యాదులు. వరుస వివాదాలు వెంటాడుతున్నా ఆయన మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారా..? ఏకంగా పార్టీనే ధిక్కరించే స్థాయికి మేటర్ వెళ్తోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా… ఎమ్మెల్యే అనుచరుడు బరిలో దిగడాన్ని ఎలా చూడాలి? అతనికి ఎవరి ఆశీస్సులున్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఆయన వ్యూహం ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే…
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.
సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ…
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారని, కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గుత్తా ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో శాసనమండలి…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. Also Read: Gold Rate Today: నేడు…
పశ్చిమ బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్లో అధికారంలో తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పొత్తు ఉండబోదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.
Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.
Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…