Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి సవాల్!
- కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు కిషన్ రెడ్డి సవాల్
- కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?
- మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే
- బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఎం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ వస్తే.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారాని కిషన్ రెడ్డి విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయింది. పదేళ్లలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగింది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాష్ట్రంలో మార్పు రాలేదు.. మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే, పరిపాలన మాత్రం అలానే ఉంది. బీజేపీ మాత్రమే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ అభ్యర్థులు గేలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసింది. అసలు శాసనమండలి ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్ఎస్ వ్యవహరించింది’ అని మండిపడ్డారు.
Also Read
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
Also Read: Talasani Srinivas Yadav: వాళ్లను చూస్తున్నాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు!
‘హైదరాబాద్ నగరంలో నిరుద్యోగుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం పీఆర్సీ ప్రకటించినా రాష్టంలో మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. రాబోయే రోజైల్లో కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడేరుగు.. ఉన్న స్కూళ్లకు రంగులు వేయాలని పరిస్థితి తెలంగాణలో వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బతీశాయి. రాబోవు అన్ని ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మాత్రమే వస్తుంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. తెలంగాణలో అధికారంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!