Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్లోనే ఆప్ ప్రభుత్వం ఉంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కూడా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుణ్యస్నానం చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
Congress: ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొంద లేకపోయింది. 67 చోట్ల ఏకంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందంటే, ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్, గత మూడు పర్యాయాలుగా కేవలం ‘సున్నా’ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఢిల్లీ ఎన్నికల్లో 70 సీట్లకు బీజేపీ 48, ఆప్ 22 చోట్ల గెలుపొందాయి. అయితే,…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే ఆప్ ఓటమికి స్వయంకృత అపరాధమే కారణమని తెలుస్తోంది.
అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ జీరో హ్యాట్రిక్ కొట్టిందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.