Tata Punch EV Facelift: పాత పంచ్ EVతో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్‌లో 5 కీలక మార్పులు..
- 5 కీలక అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్..
- ధర విధానం, టెక్ ఫీచర్లలో భారీ మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Punch EV Facelift: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) వెర్షన్ లాంచ్‌ను టాటా మోటార్స్(Tata Motors) లాంచ్ చేసింది. పాత మోడల్ పంచ్ ఈవీలో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ మరింత స్టైలిష్‌గా, టెక్ లోడెడ్‌గా ఉంది. ధరలో కూడా టాటా కీలక మార్పును తీసుకువచ్చింది. ఎంట్రీ లెవల్ ఈవీలో టాప్ పొజిషన్‌లో ఉండేందుకు టాటా మోటార్స్ పంచ్ ఈవీని తీసుకువచ్చింది. పాత పంచ్ ఈవీ, కొత్తగా విడుదలైన ఫేస్ లిఫ్ట్ వెర్షల్‌లో ముఖ్యంగా 5 కీలక అప్‌గ్రేడ్స్ చోటుచేసుకున్నాయి.
ధర విధానం:
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ఇటీవల కాలంలో చాలా కంపెనీలు తమ ఈవీ కార్లను BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ఆప్షన్‌తో తీసుకువస్తున్నాయి. టాటా కూడా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఈవీ కార్లలో సగం ధర దాని బ్యాటరీ ప్యాక్‌కే ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా కారును మాత్రమే కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దెకు ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో కారు ధరలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే ఎంజీ విండ్‌సర్ ఈవీకి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన మారుతి సుజుకి ఈ -విటారా కూడా ఇదే విధానాన్ని తెచ్చింది.
ఫ్రంట్ స్టైలింగ్:
పాత దానితో పోలిస్తే కొత్త పంచ్ ఈవీలో ముందు భాగం పూర్తిగా మారింది. మరింత బోల్డ్‌గా ఫేస్‌లిఫ్ట్ ఉంది. పూర్తి-వెడల్పు స్ట్రిప్‌తో అనుసంధానించబడిన సీల్డ్ గ్రిల్, స్లిమ్ LED DRLలతో క్లీనర్ ఫాసియాను కలిగి ఉంది. ఏరో 16-ఇంచ్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది.
పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్:
పాత మోడల్ పంచ్ ఈవీతో పోలిస్తే, కొత్తగా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో బ్యాటరీ సామర్థ్యం పెరిగింది. పాత వెర్షన్‌లో 25 kWh మరియు 35 kWh ప్యాక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌లో 40 kWh కూడా అందుబాటులో ఉంది. ఇది 468 కి.మీ ARAI పరిధిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే రియల్ లైఫ్ లో 350 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. 15 నిమిషాల డీసీ ఫాస్ట్ ఛార్జ్‌తో 135 కి.మీ పరిధి వస్తుంది. ఇక 65 kW ఛార్జర్‌లో 20-80% నుండి పూర్తి రీఛార్జ్ 26 నిమిషాలు పడుతుంది.
టెక్ లోడెల్ ఫీచర్లు-క్యాబిన్ మార్పులు:
టెక్నాలజీ పరంగా పాత దానితో పోలిస్తే కొత్తది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. లోపల రీడిజైన్ చేసిన ఏసీ వెంట్లు, కొత్త లెథరెట్ అప్హోల్స్టరీ , పియానో బ్లాక్ కన్సోల్ క్యాబిన్‌కు ఫ్రెష్ లుక్ ఇస్తాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ టెక్నాలజీ ఉన్నాయి.
మెరుగైన భద్రతా:
భద్రతాపరంగా ఫేస్ లిఫ్ట్ మరింత సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. స్టాండర్డ్ 6-ఎయిర్ బ్యాగ్స్, హైబీమ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?