Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రోశయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని లక్షీకాపూల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి పాల్గొన్నారు. రోశయ్య సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. Thammudu : ‘తమ్ముడు’ రివ్యూ.. ఇంకెప్పుడు నితిన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, రోశయ్య రాజకీయాల్లో చేసిన సేవలు…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో…
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన…
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు.…
Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక…
TPCC Mahesh Goud : బీజేపీ నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బిజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ‘‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’’…
Sama Ram Mohan Reddy : తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 240 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి…
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో…
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్…
DK Aruna : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా పత్రికల్లో వచ్చిన లేఖ. ఈ లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా కవిత ఈ లేఖ రాశారా? లేదా ఆమె పేరుతో వేరే ఎవరైనా విడుదల చేశారా? అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఈ లేఖ విడుదల వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని డీకే…