Renuka Chowdhury: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిను ప్రశంసలతో ముంచెత్తారు. ఇది రాజకీయ నిర్ణయం కాదని, సామాజికంగా గొప్ప మార్పునకు నాంది అని అభివర్ణించారు. అలాగే, ఇవ్వాళ నాకు చాలా గర్వంగా ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ గర్వపడే రోజులు ఇవి అని రేణుకా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సామాజిక న్యాయం సాధ్యమవుతోందని తెలిపారు.
Read Also:Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
ఎవరెవరో మాటలు చెప్పారు కానీ.. చేసి చూపించింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆమె స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినెట్ తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ నిర్ణయం వల్ల వారికి రాజకీయాల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ మెరుగైన అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఒక్క సంతకంతో మహిళల జీవితాలను మార్చారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో భర్తలు కూడా గౌరవం చూపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ హయంలో బీసీలకు చరిత్ర సృష్టించే నిర్ణయం తీసుకున్నారు. 42 శాతం రిజర్వేషన్ దేశానికే మార్గదర్శిగా నిలుస్తుందని ఆమె అన్నారు.
Read Also:Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !
ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నాకు దేశవ్యాప్తంగా మెసేజ్‌లు వస్తున్నాయి. ప్రజలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని రేణుకా చౌదరి అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై ఆమె విమర్శలు గుప్పించారు. వాళ్లు పూటకోసారి పార్టీ పేరు మారుస్తుంటారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి.. ఎందుకంటే వాళ్లు అలాగే ఉన్నప్పుడు మేము అధికారంలో ఉంటాం. బీఆర్ఎస్‌లో గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాలు నాయకులు చెప్పినవి సొల్లు కబుర్లే.. కానీ ఇప్పుడు రాష్ట్రానికి అసలైన సీఎం లభించడమే గొప్ప విషయం. రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం దేశానికి మార్గం చూపుతుంది. చేతి గుర్తు అన్నది దేశాన్ని ముందుకు నడిపే సత్తా ఉన్న చిహ్నం అని అన్నారు.