Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రోశయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని లక్షీకాపూల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి పాల్గొన్నారు. రోశయ్య సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Thammudu : ‘తమ్ముడు’ రివ్యూ.. ఇంకెప్పుడు నితిన్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, రోశయ్య రాజకీయాల్లో చేసిన సేవలు తీరని ముద్రవేశాయన్నారు. ఆయనకు సరైన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నిష్ట, నిబద్ధతకు రోశయ్య ఓ ఉదాహరణ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల పట్ల ఆయన చూపిన సేవా దృక్పథం అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు.
Gaza: అమెరికా భద్రతా దళాలు ఘాతుకం.. గాజా శరణార్థులపై కాల్పులు.. 118 మంది మృతి!