పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
దేశరాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి పోలీసులు నెట్టేశారు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి తోసేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 21న సోనియాను దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు. సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్.…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,…