దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు.
సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా చేసేది చేయాలి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. సాధ్యమయినంత వరకూ తాను కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేయడానికి ప్రయత్నిస్తా అన్నారు.
అగ్నిపథ్ కాంగ్రెస్ ఒక్కటే కాదు యువత వ్యతిరేకిస్తోంది. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదానీ, అంబానీకి కంపెనీలు అమ్మేస్తోంది. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక మా పాత్ర వుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తుంటే, యువతను హింస వైపు నడిపిస్తోందంటే కాంగ్రెస్ కారణం అంటున్నారు. హింసాత్మక ఘటనలు ఒక్క తెలంగాణలోనే కాదు. దేశమంతా జరుగుతున్నాయి. మీరు చేసిన తప్పుల్ని దాచుకునే ప్రయత్నం చేశారు. 8 ఏళ్ళ నుంచి మోడీ ఏం చేశారు. దేశభవిష్యత్తు కోసం దార్శనికులు అయి వుండాలి. రాబోయే రోజుల్లో ఉన్మాదం పెరుగుతుంది. మారణకాండ, అల్లర్లు జరుగుతున్నాయి. దేశంలోని ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. నాలుగు రోజులు నీ వెనక జనం వుంటారు. దేశం కాలిపోక ముందే అంతా మేల్కొనాలి. బీజేపీని నమ్మవద్దు.
రాహుల్ గాంధీ ఈడీ విచారణ వెనుక దుర్మార్గం వుంది. ఏమీ లేని దానికి నోటీసులు ఇచ్చారు. గంటల తరబడి విచారించడం దారుణం. ఎటువంటి మచ్చలేని గాంధీ కుటుంబంపై మచ్చ వేస్తున్నారు. నష్టాల్లో వున్న పత్రికని కాపాడడానికి వారి ఆస్తులే రాసిచ్చారు. అక్రమాలు ఏం జరగలేదు. యంగ్ ఇండియా నో ప్రాపిట్ ఆర్గనైజేషన్. సోనియా గాంధీని కూడా ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే పరిస్థితి రాదు. మూసేసిన కేసుల్ని మళ్ళీ తోడేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దేశం కోసం త్యాగాలు చేసింది గాంధీ కుటుంబం. వారి ఆస్తుల్నే జనం కోసం ఇచ్చారు. వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి? ఏదో జరిగిందనే భ్రమ కల్పిస్తున్నారు. రాహుల్ గాంధీ బయటకు వస్తారు.
భట్టి విక్రమార్కకు టీఆర్ఎస్ కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కుట్ర. నా శాసనసభలో ప్రసంగాలు, డిమాండ్లను పరిశీలిస్తే నేను విమర్శనాత్మకంగా, నిర్ణయాత్మకంగా మాట్లాడాను. భట్టి విక్రమార్క ప్రతిపక్షనేతను తక్కువగా చేయాలి, డీ ఫేం చేయాలని కొన్ని శక్తులు పనిచేస్తాయి. కావాలని తప్పుడు ప్రచారం చేస్తాయి. 8 ఏళ్ళ పోరాటం కొట్లాటలతోనే సరిపోతోంది. లాలూచీ పడి, కాంట్రాక్టులు తెచ్చుకునే తత్వం నాది కాదు. నాపై తప్పుడు ప్రచారం చేసేవారికి ఇది వర్తిస్తుంది. ఇళ్ళలో కూర్చోవద్దు. ప్రజలతో నడవాలి. ప్రభుత్వంపై పోరాటం చేయాలి. నా పాత్ర పోషిస్తూ వుంటే. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సాధ్యమయినంత ఎక్కువమందిని కలుస్తాం. ప్రజలతో తిరగాలన్నారు భట్టి విక్రమార్క.