Congress: పదవుల కోతపై స్పందించిన జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో మాట్లాడేందుకు భయపడుతున్నట్లున్నారని వ్యాఖ్యానించారు.. ఇక, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలంటూ హాట్ కామెంట్లు చేశారు జగ్గారెడ్డి.
Read Also: Farm Laws: నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతం.. ఏముందంటే..?
Also Read
అయితే, తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్న ఆయన.. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటాను అని మరోసారి స్పష్టం చేశారు జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని సమర్థిస్తానన్న ఆయన.. మొన్న తాను కొంత వ్యక్తిగతంగా మాట్లాడిఉంటే కొంత వరకు నొచ్చుకొని ఉంటారన్న ఆయన.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. ఇక, కాంగ్రెస్ పార్టీలోనే తప్పు ఒప్పులు మాట్లాడుకునే వీలు ఉంటుందన్నారు జగ్గారెడ్డి.. అంతేకాదు, పదవుల కోత అనేది కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. అయితే, మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న జగ్గారెడ్డి.. ఇంకా… ఏదైనా సంచలన ప్రకటన చేస్తారా? వెనక్కి తగ్గుతారా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!