Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Fires On PM Narendra Modi In Sangareddy: సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మొన్న తెలంగాణలో పర్యటించినప్పుడు ఉచితాలు ఇవ్వొద్దని మోదీ అన్నారని, మరి మీరు మాత్రం అదాని, అంబానీల కోసం పని చేయొచ్చా? అంటూ ప్రశ్నించారు. పేదలు ఏం పాపం చేశారని నిలదీసిన ఆయన.. వారికి ఉచితాలు ఎందుకు ఇవ్వకూడదని, మీరు పెద్దలకు ఎందుకు ఇస్తున్నారని అడిగారు.
భారీ వర్షాల కారణంగా వరదలు వస్తే.. సీఎం కేసీఆర్ ఒక్కరే ఈ పరిస్థితిని పరిష్కరించారని, కాంగ్రెస్ – బీజేపోల్లు హైదరాబాద్‌లోనే ఉండి ఏమీ చేయలేకపోయారన్నారు. కడెం ప్రాజెక్టుకు చరిత్రలో లేనంత వరద వచ్చినా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చుసుకున్నామన్నారు. ప్రతిపక్షాలు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నాయని, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, వరద సహాయం కూడా చేయలేదని విమర్శించారు. సహాయం చేయకుండా తిడితే, ప్రజలు మిమ్మల్ని క్షమించరన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పిన మంత్రి హరీష్.. సాయం పొందిన చేతులు దీవెనలు అందిస్తాయని చెప్పారు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
బీజేపీ అధికారంలోకి వస్తే.. బాయిల దగ్గర కూడా మీటర్లు పెడతారని, పెన్షన్లు తగ్గిస్తారని, కల్యాణ లక్ష్మీ కూడా ఇవ్వరని హరీష్ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. పేదల కడుపు కొట్టి, గద్దలకు పంచుతుందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తోందని, కేంద్రం మాత్రం మహిళలకు ప్రాధాన్యమిస్తామంటూ 8 ఏళ్ల నుంచి నాన్చుతూనే వస్తోందని కడిగిపారేశారు. బేటీ బచావో బేటీ పడావో అని గొప్ప మాటలు చెప్పుకోవడానికే బీజేపీకి సరిపోయిందని కౌంటర్లు వేశారు. డబుల్ ఇంజన్ అని బీజేపీ మొత్తుకుంటోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో సంగారెడ్డిలో రూ. 50 కోట్లలో గల్లీల్లోనూ రోడ్లు వేస్తామని, వచ్చే ఆగస్టు నాటికి రోడ్లు సహా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని తాను కలెక్టర్‌కి ఆదేశాలిచ్చానని హరీష్ రావు చెప్పారు. మంచి నీళ్ళ కోసం సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లు ఇచ్చారని, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, ఆరునెలల్లో స్వచ్ఛ సంగారెడ్డిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సంగారెడ్డిలో రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టుకున్నామని, రాబోయే రోజుల్లో 600 పడకలతో హాస్పిటల్ కూడా కడుతామని అన్నారు. సంగారెడ్డిలో బస్తీ దవాఖాన కూడా ఉందని తెలిపారు.
నార్మల్ డెలివరీనే అందరూ కృషి చేయాలని, అలా చేస్తే తల్లితో పాటు బిడ్డకి మంచిదని హరీష్ చెప్పారు. పైసలుంటే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండని, పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికే రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 100 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండని సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కాకపోయినా, పనులన్నీ పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, కొత్తగా 12 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం, ఇల్లు లేని వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హరీష్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!