కేసీఆర్ ట్రాప్ లో పడను.. టీఆర్‌ఎస్ ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. రాజీనామా తోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే… దళిత బందు ఇచ్చినప్పుడే.. రాజీనామా చేస్తా అని ప్రకటించారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీ లో ఎన్నో సార్లు మాట్లాడిన అంటూ గుర్తు చేసారు. కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశా అంటూ పేర్కొన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు…
తన కూతురిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతుందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి అయిన తన కూతురుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని.. ఆమె క్యారెక్టర్ ను హత్య చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 2014, 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడమే తప్పు అని..…
MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రశ్నించింది. గతంలోనే సోనియా గాంధీకి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా.. కరోనా బారిన పడిన కారణంగా ఆ సమయంలో సోనియా గాంధీ హాజరుకాలేదు. తాజాగా గురువారం రోజున ఈడీ సోనియాగాంధీని 3 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు.
రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు. అధ్యక్షుడు సహా వివిధ పదవులు చేపట్టినా పార్టీపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నా కీలకమైన కేంద్ర మంత్రి పదవులు చేపట్టలేదు. ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ఆయన చెప్పుకోదగ్గ ఫలితాలు రాబట్టలేకపోయారు. దీంతో హస్తం పార్టీ ఒక్కో రాష్ట్రాన్నీ…
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో…