Revanth Reddy: పార్టీలో చేరేవారిపై టీఆర్ఎస్ కేసులు పెట్టి వేధిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా.. త్వరలోనే హైదరాబాద్ లో విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సభ పెడతారని, దానికి పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఈనేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్, బీజేపీ ప్లాన్ లో భాగంగానే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు.
కాగా.. పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రాన్ని తయారుచేయాలని పీకే ప్లాన్ చేస్తున్నాడని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాగా.. వారి చర్యలకు విరుద్ధంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ కూడా సభ పెడుతుందని..దానికి ఎంతమంది వస్తారో చూడాలని వ్యాఖ్యానించి రేవంత్ జులై 7కి తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాదిలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్ కు వివరించినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే.. ప్రస్తుతం అంతా సద్దుమణిగిందన్నారు. అంతేకాకుండా.. మోడీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించాం కానీ..అలా జరగలేదని, టీఆర్ఎస్, బీజేపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొలేదని, రెండు ఒక్కటేనని విమర్శించారు.
Also Read
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..