Santokh Singh: భారత్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santokh Singh: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఇవాళ లుథియానాలో ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఎంపీ సంతోక్ కు 77 ఏళ్ల వయసు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎంపీ సంతోక్ నీరసంగా పడిపోయారు. దీంతో ఆయన్ను పగ్వారాలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. కాంగ్రెస్ నేతలు రాణా గుర్జీత్ సింగ్, విజయ్ ఇందర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీకరించారు. కాగా.. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. అయితే.. గతంలో సంతోక్ పంజాబ్ మంత్రిగా చేశారు. సంతోఖ్ సింగ్ చౌదరి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన జలంధర్ నుండి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. పంజాబ్ మాజీ క్యాబినెట్ మంత్రి. అతను 2014- 2019 భారత సాధారణ ఎన్నికలు రెండింటిలోనూ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి. చౌదరి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఉనికిని చాటుకున్న కొద్దిమందిలో ఒకరు. కాబట్టి ఇది పాత పార్టీకి భారీ నష్టంగా పరిగణించబడుతుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కాంగ్రెస్ నేత అకాల మరణం పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, సంతోక్ సింగ్ చౌదరి పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో భారత్ జోడో యాత్రలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు. చౌదరి మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలుపుతూ,’జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సంతోక్ సింగ్ చౌదరి అకాల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను.. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..’ అని ట్విట్టర్‌లో రాశారు.
Also Read
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ਕਾਂਗਰਸ ਦੇ ਜਲੰਧਰ ਤੋਂ ਮੈਂਬਰ ਪਾਰਲੀਮੈਂਟ ਸੰਤੋਖ ਸਿੰਘ ਚੌਧਰੀ ਜੀ ਦੀ ਬੇਵਕਤੀ ਮੌਤ ਦਾ ਬੇਹੱਦ ਦੁੱਖ ਹੋਇਆ..ਪ੍ਵਮਾਤਮਾ ਵਿੱਛੜੀ ਰੂਹ ਨੂੰ ਸਕੂਨ ਬਖ਼ਸ਼ੇ ..ਵਾਹਿਗੁਰੂ
— Bhagwant Mann (@BhagwantMann) January 14, 2023
తాజావార్తలు
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!