తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కమిటీల లొల్లి నడుస్తోంది. తమకు ప్రాధాన్యత దక్కలేదని కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట, పదవులు దక్కుతున్నాయన్నారు. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదు. సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు.
దిగ్విజయ్ ఈ విషయాలపై విచారించాలన్నారు. దిగ్విజయం రావడం హర్షించదగ్గ పరిణామం..ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న నేత దిగ్విజయ సింగ్ అన్నారు ఎంపీ కోమటిరెడ్డి. రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది..హుజురాబాద్ పరిణామాలపై, తనపై వాడిన పదజాలపై దిగ్విజయ్ విచారణ జరపాలన్నారు. ఢిల్లీలో దిగ్విజయ్‌ని కలుస్తానన్నారు. కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు…ఢిల్లీ పెద్దల సూచన మేరకే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాను.
ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానం అన్నారు కోమటిరెడ్డి. ఇదిలా ఉంటే… రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించిన సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను మాట్లాడానని, అయితే ఏం మాట్లాడాననేది చెప్పలేనన్నారు కోమటిరెడ్డి. మోడీతో కోమటిరెడ్డి భేటీ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీలో కాకరేపింది.
Read Also: Samantha: సమంత సంచలన నిర్ణయం.. ఇక సినిమాలకు గుడ్ బై..?