Aleti Maheshwar Reddy Resignation: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేశారు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగిన తాజా పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తేల్చుకుంటానంటూ.. ఆయనకే ఫిర్యాదు చేస్తానంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన.. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు.. బీజేపీ…
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండాపోయింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కూడా పోటీ పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిలో లేకపోయినా.. ఆపార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాత్రం అలాగే ఉన్నాయి.
కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనపై ఏం చేసినా ప్రతీకారం తీర్చుకోకుండా, రాజనీతిజ్ఞుడిగా ఉన్నందుకు ఆయనకు క్రెడిట్ తప్పక ఇవ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు.
PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.. అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లాంచాలని…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పీసీసీ చీఫ్ ముందుకు సాగుతున్నారు.