తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీలు వారి బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నజర్ సారించింది. భారీ చేరికల దిశగా ఫోకస్ పెట్టింది. ఆపరేషన్, ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని హస్తం నేతలు చూస్తున్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ టూర్ లో ఈ చేరికలు ఉండేలా కసర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Agent: ‘ఏజెంట్’ కోసం రంగంలోకి ప్రభాస్…
అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక దాదాపు ఖాయం అయింది. బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని నేతలు.. బీజేపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న వారిపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీ చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివర్ లో జనరల్ ఎలక్షన్స్ ఉండడంతో చేరికలతో ఉత్సాహం తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది.
Also Read : Viral Video: పింఛన్ కోసం వృద్ధురాలి పాట్లు.. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒంటి కాలితో నడక..
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. అక్కడ నాగం జానార్థన్ రెడ్డి అంగీకరిస్తే.. దామోదర్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుంది. ఇక నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ వీడటంతో.. ఆ గ్యాప్ పుల్ చేసుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. నిర్మల్ లో బీఆర్ఎస్ నేత శ్రీహరి రావును చేర్చుకునేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు శ్రీహరి రావుతో చర్చలు పూర్తి చేసింది. దీంతో ఆయన కూడా రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
Also Read : Viral : స్కర్ట్స్ వేసుకుని ‘అబ్బా’యిలు.. వింతగా చూసిన అమ్మాయిలు
ఇక ప్రజల్లో కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు కూడా ఉండటంతో లీడర్ల కోసం వేట కొనసాగిస్తుంది. ఇప్పటికే ప్రముఖ నాయకులకు కూడా హస్తం పార్టీ నేతలు గాలం వేస్తుంది. రాష్ట్రంలో ఈ సారి అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే హస్తం పార్టీ అధిష్టానం కూడా ఘార్ వాపసీకి.. ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది.