TS Congress : కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి, జూపల్లి.. 30న ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి ఇంట్లో చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిని చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఒక దూకుడైన సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా పెద్ద ఎత్తున చేరికలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.
Also Read : Adimulapu Suresh: చంద్రబాబుపై మంత్రి సురేష్ సెటైర్లు
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బలంగా పార్టీని తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. బలమైన లీడర్లను చేర్చుకోగలిగితే వాళ్ల స్థాన బలంతో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి సహా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయాత్నాల్లో కాంగ్రెస్ ఉంది.
Also Read : Atiq-Ashraf case: అతిక్ అహ్మద్ హత్య.. కిల్లర్‌లతో క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్
పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీమ్ వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. దీంతో పాటు ఆయనపై ఢిల్లీ నుంచి హస్తం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరితేనే నెరవేరుతుందని.. ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 30వ తారీఖున వీరు చేరుతున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..