రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండాపోయింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కూడా పోటీ పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిలో లేకపోయినా.. ఆపార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాత్రం అలాగే ఉన్నాయి. పలు పట్టణాలు, నగరాల్లో కాంగ్రెస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే, వాటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు మాత్రం చెల్లించేవారు లేకుండాపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు ఆస్తి పన్ను చెల్లించాలని ఇటీవల ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే, వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మళ్లీ యాక్టివ్ అవుతోంది.
Also Read:Death By Stray Dogs: ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల బీభత్సం.. ఐదేళ్ల బాలిక మృతి
ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలు బకాయి ఉన్న కార్పొరేషన్ పన్ను చెల్లించేందుకు సిద్ధమైంది. 1994 నుంచి ఆస్తి పన్ను, వాటర్ పన్ను ఇతరత్రా కలిపి 1.34 కోట్లు బకాయి ఉన్నాయి. మార్చి 31లోపు చెల్లిస్తే వడ్డీ లేదని ప్రభుత్వ జీవోలో పేర్కొంది. దీంతో సుమారు 60 లక్షల మేర బకాయి సొమ్ము చెల్లించింది. పార్టీ నేతలు బకాయి సొమ్ము చెల్లింపుల కోసం విరాళాలు ఇవ్వాలని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కోరారు. పార్టీ నేతలు ఇచ్చిన విరాళాలు సాయంతో మొత్తం బకాయి చెల్లించారు.
Also Read:Andhra Pradesh: ఏపీలో అరుదైన మూలకాలు.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్న శాస్త్రవేత్తలు..
ప్రస్తుతం ఆంధ్రపద్రేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో లేదు. దీంతో ఈ బకాయిలపై విరాళాల సేకరించారు. ఈ బకాయిలు చెల్లించేందుకు నిధులు అందించాలని పార్టీ నేతలకు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పన్నులు చెల్లించినట్లు సమాచారం.