కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీలు విమర్శల జోరు పెంచాయి. బాగల్ కోట్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని.. ఆ పార్టీకి నాయకులే కరువయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకనే బీజేపీ రెబల్ నాయకులపై ఆధారపడిందని అమిత్ షా సెటర్లు వేశారు.
Also Read : Virupaksha: ఇంకా ఎవరి దగ్గరా అడ్వాన్స్ తీసుకోలేదు: కార్తీక్ దండు
ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని.. ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని కేంద్ర హోంమత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను బీజేపీ పార్టీ పక్కన పెట్టింది. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీలో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించాడు.
Also Read : Allola Indrakaran Reddy : మహారాష్ట్రలో కూడా సీఎం కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. అదే నెలలో 13వ తారీఖున కౌంటింగ్.. ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అ యితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృద విశ్వాసంతో ముందుకెళ్తుంది. ఈసారి 150 స్థానాలకు పైగా సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.