Rahul Gandhi : రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటకకు రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడే రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తారు. రాహుల్ రెండ్రోజుల పర్యటనలో పలు ఆలయాల సందర్శన, ప్రజలతో చర్చలు, బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ శనివారం పేర్కొ్ంది. రాహుల్ షెడ్యూల్ ఇలా సాగనుంది.. తొలుత ఆయన ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో బగల్‌కోటెలోని కూడల సంగమకు వెళ్తారు. లింగాయతుల ప్రధాన దేవస్థానాల్లో కూడల సంగమ ఒకటి.
Read Also : Bhakthi TV : అక్షయ తృతీయ నాడు ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు పటాపంచలై.. సర్వ సంపన్నులవుతారు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కర్ణాటకలో లింగాయతుల ప్రభావం ఎక్కువే అని తెలిసిందే. ఆయన సంగమనాథ టెంపుల్, ఐక్య లింగలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం, బసవ జయంతి వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం విజయపురలో శివాజీ సర్కిల్ దగ్గర జన సంపర్క కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రోజైన సోమవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ చెరుకు రైతులతో చర్చిస్తారు. ముఖ్యంగా బెళగావి రామదుర్గ ఏరియాలోని స్థానికులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత గదగ్ వెళ్లి యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆయన హావేరి జిల్లాలో హంగల్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. అదే రోజు రాత్రి ఆయన హుబ్బలికి తిరిగి పయనమవుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. కర్ణాటకలో రెండు వారాల వ్యవధిలోనే రాహుల్ గాంధీది ఇది రెండో పర్యటన.
Read Also : HD Kumaraswamy : అనారోగ్యం కారణంగా హాస్సిటల్లో చేరిన మాజీ సీఎం
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..