ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.
KTR: సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందని.. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వైసీపీ బైబై చెప్పడం ఖాయమనిపిస్తోంది.. పార్టీ మార్పుపై ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అక్కడే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు..
Praja Palana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హులను...
వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి
మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు.