YS Sharmila: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని స్థాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. కాగా ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ…
Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికుల నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు.
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ..శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతుంది.. ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు.
Ponnam Prabhakar Visits Husnabad: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన సొంత నియోజకవర్గ హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి హుస్నాబాద్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ‘ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. సెంటిమెంట్ కాదు హుస్నాబాద్‌లో డెవలప్మెంట్ మొదలైంది.…
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల పోలికల్ హీట్ పెరిగిపోతుంది. తాజాగా వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని 15 మంది ఎంపీటీసీల్లో అవిశ్వసానికి 10 మంది ఎంపిటీసీలు మద్దతు పలికారు. జగిత్యాల ఆర్డీవో ఆఫీసులో ఎంపిటీసీలు తమ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని సమర్పించారు. Also Read: Google Most Search in India 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది వీటికోసమే…