Venkatesh Netha Borlakunta: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు.
వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల ఎంపీ వెంకటేష్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటేష్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్.. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్,బెల్లంపల్లి బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో వెంకటేష్ నేత కనిపించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన నేత.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పల్లి స్థానానికి పోటీ చేసి ఎంపిగా వెంకటేశ్ నేత గెలిచిన విషయం తెలిసిందే. అయితే నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.
మరోవైపు మహబూబ్ నగర్ లోని బీఆర్ఎస్ కు షాక్ తగలనుంచి కాంగ్రెస్ లోకి పారిశ్రామిక వేత్త మన్నే జీవన్ రెడ్డి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో జీవన్ రెడ్డి చేరనున్నట్లు టాక్.. ఆయనతో పాటు ఆయన బాబాయి ఎంపి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతుంది.
Shamshabad: శంషాబాద్ లో భారీగా పట్టబడిన డ్రగ్స్.. 30 మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్