వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు.
Teacher Transfers: ఈ నెల 8వ తేదీన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫాం పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని.. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారన్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
కేరళ ప్రభుత్వం ఇవాళ (శనివారం) కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కేరళలోని ఓ దేవాలయం దగ్గర జంతుబలి ఇచ్చారన్న వాదనను తోసిపుచ్చింది.
సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.
పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది.