మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాపన్నపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చినా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే.. వలసల మీద దృష్టి పెట్టాడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు నిధులు…
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల…
కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల(CRIF) నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31 రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి నేటి సరిగ్గా వంద రోజులు అవుతుంది. గతేడాది డిసెంబర్ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల ప్రగతి నివేదనను రిలీజ్ చేసింది. డిసెంబరు 7న ప్రగతిభవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది.
తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది.
కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి…
తెలంగాణ కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పైరవీలకు తావులేకుండా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందిని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రజారాజ్యం, ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొన్ని అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇండ్లు, సొంత…
భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా.. భద్రాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీరందరూ మంచి…