తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి. రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు.
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు.
Nagarjuna Akkineni: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.
HYDRA Effect: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేశారు.
Minister Komatireddy: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖ పైన త్వరిత గతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందని అంటున్నారని.. మా విజన్ వాళ్ళ ముందు పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ వరకే కంపెనీలను పతిమితం చెయ్యమని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు.
మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి రూ.1లక్ష , రూ. 50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.