సీతారామచంద్ర సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో పేద వాళ్లకు ఇళ్లు ఇచ్చిన పాపం లేదని అన్నారు. పోరాటం చేస్తామనే వారికి సవాల్ చేస్తున్నాం.. విమర్శలు చేసే మీ మెప్పు కోసం ఈ హామీలు ప్రకటించలేదని భట్టి…
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రూ.22,500…
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ బిక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మాహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇందిరా పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో మహిళతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని కవిత కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని…
ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు…
శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు.
సికింద్రాబాద్లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ విజయోత్సవ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మరావు గౌడ్, మాగంటి గోపీనాథ్, పాడిడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. బడ్జెట్ మొత్తం నిరాశగా ఉందని విమర్శించారు. 6 పథకాల అమలుకు లక్షా 25…
ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం…
Grama Panchayathi: గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.