Grama Panchayathi:గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్‌కు ఉన్నారని గుర్తుచేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్మదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: ఆటో కార్మికులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తాం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేదంటే…
Minister Seethakka: గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించినట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యంగా రెండు గ్యారంటీలపై ఈ భేటీలో చర్చించామని, ముందుగా వాటిని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో.. ఎల్లుండి (శనివారం) నుంచి మహిళా సోదరిమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం రూ.10…