Congress: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. పథకాలు పొందేందుకు ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి హజరై క్యూ లైన్ లలో నిలబడి మరీ దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రొగ్రాం జనవరి 6వ తేదీన ముగిసింది. ఇప్పటి వరకు కోటి 24 లక్షల మంది ప్రజలు ఆరు గ్యారెంటీల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇంత సీరియస్ గా జరిగిన ఈ కార్యక్రమంలోనూ ఆకతాయిలు కొందరు తమ అతి తెలివి ప్రదర్శించారు.
Read Also: Uttarpradesh : దారుణం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి, ముఖంపై మూత్రం పోసి, ఉమ్మి నాకించి..
అయితే, ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభుత్వ పథకాల కోసం సామాన్యులు అందరు బాధపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం ఇలాంటివి చేస్తున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.