Harish Rao: ఆటో కార్మికులను రోడ్డున పడేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీష్ రావ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఆటో కార్మికులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోకార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే కానీ మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోకార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. కొద్దిరోజులుగా ఆటోకార్మికులు నిసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోకార్మికులను పట్టించుకుని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు.
Read also: YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
Also Read
వారి నెలకు 15వేల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆటోకార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఎదుర్కొన వలసని పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటోవాలను, వారి కుటుంబాలను కూడా గుర్తించాలని అన్నారు. సంక్రాంతి పండుగ అయిన ఆటోవాలన జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందని అన్నారు. ఆటో కార్మికులు నాతో చెప్పుకుంటున్న బాధలు వర్ణనాతీతం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారి బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారు కానీ.. వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదని అన్నారు. ఆటోవాల బాధలను గుర్తించి ప్రభుత్వం వారికి సహాయం చేయాలని కోరారు.
Health Tips : టీవీ చూస్తూ అలానే నిద్రపోతున్నారా? ఈ విషయం తెలిస్తే జన్మలో పడుకోరు..
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!