Minister Seethakka: గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి సీతక్క తొలిసారిగా ములుగు నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ములుగు జిల్లా మహ్మద్ గౌస్ పల్లిలో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి నుంచి గట్టమ్మ గుడి వరకు 15 కిలోమీటర్ల మేర ర్యాలీగా బయలుదేరారు. గట్టమ్మను దర్శించుకోకుండా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మేడారం వెళ్లారు. త్వరలో మేడారంలో నిర్వహించే జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రిగా ఇతర భాద్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా అన్నారు.
Read also: Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
నేను ఎక్కడున్నా ములుగే నా కుటుంబం, ములుగు ప్రజలు నా కుటుంబ సభ్యులని అన్నారు. గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని తెలిపారు. ప్రజలకు జవాబు దారిగా చెప్పాల్సిన బాధ్యత నాపై పెరిగిందన్నారు. ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతా అని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా అన్నారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటలకు భోజనం విరామం అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటలకు ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బస చేయనున్నారు.
Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు