Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు.
సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె…
ఆంధ్రాకు ఆవకాయ్ పచ్చడికి అవినాభావ సంబంధం వుంది. ఆంధ్రా ఆవకాయ్ అంటే ఓ క్రేజ్. అందులోని గోదావరి జిల్లాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదని నానుడి. వేసవి సీజన్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా సీజన్ వారీగా పచ్చళ్ళు పెడతారు. ఇప్పుడు పచ్చళ్ళుAcharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా? పెట్టాలంటే తలకు మించి భారంగా మారింది. అన్ని ధరలు పెరిగి పచ్చళ్ళు పెట్టాలంటే రెట్టింపు ఖర్చు కావడంతో వామ్మో ఆవకాయ అంటున్నారంతా. కారం మిరపకాయలు…
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతుంటే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేయడాన్ని భట్టి తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి…