Independence Day Celebrations: ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీఫ్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day Celebrations: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి వేరే దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించలేదు. దేశంలోని సామాన్యులనే చీప్‌గెస్టులుగా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 1800 మంది వరకు ఆహ్వానాలను సైతం కేంద్ర ప్రభుత్వం పంపించింది. రేపు ఢిల్లీలో జరిగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామాన్యులే చీప్‌గెస్టులుగా హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో ఉన్న వారిని ముఖ్య అతిధులుగా పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నారు.
Read also: Rowdy Sheeter: బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రేపు పదోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగియనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న మోడీ భావన నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వారిలో
400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాలవారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్ జల్ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం పంచుకోనున్నారు. వారివారి సంప్రదాయ దుస్తుల్లో స్వాతంత్య్రోత్సవాల్లో పాల్గొనడానికి ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను కూడా ఆహ్వానించారు. వేడుకలకు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు వెయ్యి ఏర్పాటు చేశారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. హర్యానాలో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. వేడుకలు జరిగే సమయంలో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
Read also: Virupaksha team : మళ్ళీ జట్టు కట్టిన విరూపాక్ష టీం.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారుగా
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పెషల్‌గా సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలతో ముడిపడిన వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా జాతీయ యుద్ధ స్మారక కేంద్రం, ఇండియా గేట్, విజయ్‌చౌక్, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, ప్రగతిమైదాన్, రాజ్‌ఘాట్, మరికొన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక సెల్ఫీపాయింట్లు ఏర్పాటుచేశారు. భారత్ పట్ల ప్రపంచం పెట్టుకున్న ఆశలు, వ్యాక్సిన్ విజయాలు, యోగా, ఉజ్వల యోజన, అంతరిక్ష రంగంలో ఇండియా సత్తా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు, ఇతివృత్తాలను వీటికోసం ఎంచుకున్నారు. మైగవ్(My Gov) పోర్టల్‌లో ఆగస్టు 15-20 మధ్య ఆన్‌లైన్ సెల్ఫీ పోటీలను రక్షణశాఖ నిర్వహిస్తుంది. ప్రజలెవరైనా 12 ప్రసిద్ధ కేంద్రాల వద్ద తీసుకున్న ఒకటి, అంతకుమించిన సెల్ఫీలు అప్‌లోడ్‌చేస్తే అందులో ప్రతి కేంద్రం నుంచి 12 మంది విజేతలను ఎంపికచేసి, వారికి రూ.10వేల చొప్పున నగదు బహుమతిగా అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!