ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విరుచుకుపడ్డారు. తనని దసరా బుల్లోడు సంక్రాంతి గంగిరెద్దుగా అభివర్ణించడంతో పరుష పదజాలంతో ప్రశ్నించారు. రేగా కాంతారావు నువ్వు గెలిచింది ఎక్కడా.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడుపోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని అన్నారు.
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను…
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారని.. అప్పుడు సీఎం కేసీఆర్ ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను చూసి మోడీ భయపడుతున్నారని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు.
బెంగాల్‌లో 5న జరగబోయే ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం కలిసి అధికార టీఎంసీపై దాడిని పెంచాయి. ఇండియా కూటమిలో ఒకవైపు మూడు పార్టీలు కలిసి ఉంటూనే.. ఉప ఎన్నిక రాగానే ప్రచారంలో అధికార టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతవారినైనా కూడా అస్సలు భయం లేకుండా తాను అడగాలనుకున్న మాటను అడిగేస్తాడు.. బుల్లితెరపై జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం కు సంబందించిన ప్రతి ప్రోగ్రాం లో ఆది కనిపిస్తూ అలరిస్తాడు.. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో రెచ్చిపోయాడు.. సీనియర్ నటుడు నరేష్ పై దారుణమైన పంచులు వేసాడు అందుకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ప్రోమో వీడియోలో…
తమకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని ఆరోపించారు.
ఆరు నూరైనా నా ప్రాణం అడ్డేసి మీ అందర్నీ కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.